కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
సుస్వాగతం.
ఇది యెహోవాసాక్షులు వేర్వేరు భాషల్లో రూపొందించిన ప్రచురణల పరిశోధనా పరికరం.
ప్రచురణలను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి, దయచేసి jw.orgచూడండి.
  • ఈ రోజు

సోమవారం, నవంబరు 10

‘అన్నిటినీ పరీక్షించండి.’—1 థెస్స. 5:21.

“పరీక్షించి” అనే పదాన్ని గ్రీకులో బంగారం, వెండి లాంటి లోహాలు అసలైనవో కావో తెలుసుకునే సందర్భంలో ఉపయోగించేవాళ్లు. అదేవిధంగా, మన కంటపడ్డ లేదా చెవినపడ్డ విషయం నిజమో కాదో పరీక్షించి తెలుసుకోవాలి. మహాశ్రమ దగ్గరపడుతుండగా మనకు ఈ సలహా చాలా ప్రాముఖ్యం. వేరేవాళ్లు చెప్పేవాటిని అమాయకంగా నమ్మే బదులు మన ఆలోచనా సామర్థ్యాన్ని ఉపయోగించి, మన కంటపడ్డ లేదా చెవినపడ్డ విషయం బైబిలు చెప్పేవాటితో, యెహోవా సంస్థ చెప్పేవాటితో సరిగ్గా ఉందా లేదా అని చూసుకోవాలి. అలా చేసినప్పుడు సాతాను చేసే ప్రచారానికి మనం పడిపోము. (సామె. 14:15; 1 తిమో. 4:1) ఒక గుంపుగా యెహోవా సేవకులు మహాశ్రమను దాటుతారు. కానీ, మనలో ఒక్కొక్కరికి రేపేమి జరుగుతుందో తెలీదు. (యాకో. 4:14) అయితే, మనం బ్రతికున్నప్పుడే మహాశ్రమ వచ్చినా లేదా మహాశ్రమ రాకముందే చనిపోయినా, నమ్మకంగా ఉంటే శాశ్వత జీవితం అనే బహుమానాన్ని పొందుతాం. కాబట్టి మనందరం, మనకున్న అద్భుతమైన నిరీక్షణ మీద మనసుపెట్టి, యెహోవా రోజు కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉందాం! w23.06 13 ¶15-16

ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం—2025

మంగళవారం, నవంబరు 11

‘ఆయన తన సేవకులకు తన రహస్యాన్ని తెలియజేశాడు.’—ఆమో. 3:7.

కొన్ని బైబిలు ప్రవచనాలు ఎలా నెరవేరతాయో మనకు తెలీదు. (దాని. 12:8, 9) అయితే ఒక ప్రవచనం మనకు అర్థం కానంత మాత్రాన అది నిజమవ్వదని కాదు. గతంలోలాగే యెహోవా మనం తెలుసుకోవాల్సిన వాటిని సరైన సమయంలో మనకు తెలియజేస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అనే ప్రకటన జరుగుతుంది. (1 థెస్స. 5:3) తర్వాత ఈ లోక రాజకీయ శక్తులు అబద్ధమతం మీద దాడిచేసి, దాన్ని నాశనం చేస్తాయి. (ప్రక. 17:16, 17) ఆ తర్వాత అవి దేవుని ప్రజల మీద దాడి చేస్తాయి. (యెహె. 38:18, 19) ఈ సంఘటనలన్నీ చివరి యుద్ధమైన హార్‌మెగిద్దోన్‌కు నడిపిస్తాయి. (ప్రక. 16:14, 16) ఇవన్నీ అతి త్వరలోనే జరుగుతాయి అనే నమ్మకంతో మనం ఉండవచ్చు. అప్పటివరకు బైబిలు ప్రవచనాల మీద మనసుపెట్టడం ద్వారా, అలా మనసుపెట్టేలా ఇతరులకు సహాయం చేయడం ద్వారా మన ప్రేమగల పరలోక తండ్రి మీద కృతజ్ఞత ఉందని చూపిస్తూ ఉందాం. w23.08 13 ¶19-20

ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం—2025

బుధవారం, నవంబరు 12

“మనం ఒకరినొకరం ప్రేమిస్తూనే ఉందాం; ఎందుకంటే ప్రేమకు మూలం దేవుడు.”—1 యోహా. 4:7.

అపొస్తలుడైన పౌలు విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు, “వీటిలో అన్నిటికన్నా గొప్పది ప్రేమే” అని అన్నాడు. (1 కొరిం. 13:13) ఆయన ఎందుకలా అన్నాడు? ఎందుకంటే భవిష్యత్తులో, కొత్తలోకం గురించి దేవుడిచ్చిన మాట మీద విశ్వాసం, నిరీక్షణ ఉంచాల్సిన అవసరం ఇక ఉండదు. అవి అప్పటికే మన కళ్లముందు జరిగిపోయి ఉంటాయి. కానీ ప్రేమ అలాకాదు. అప్పుడు కూడా మనం యెహోవా మీద, మనుషుల మీద ప్రేమ చూపిస్తూనే ఉండాలి. నిజం చెప్పాలంటే, వాళ్లమీద ఉన్న ఆ ప్రేమ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. అంతేకాదు, ప్రేమ నిజక్రైస్తవుల గుర్తింపు. యేసు తన అపొస్తలులతో ఇలా చెప్పాడు: “మీ మధ్య ప్రేమ ఉంటే, మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది.” (యోహా. 13:35) ఇంకో కారణం ఏంటంటే, ప్రేమ మనల్ని ఐక్యం చేస్తుంది. అందుకే పౌలు, ప్రేమ “పూర్తిస్థాయిలో ఐక్యం చేస్తుంది” అని అన్నాడు. (కొలొ. 3:14) అంతేకాదు, మనం ఒకరిమీద ఒకరం ప్రేమ చూపించుకుంటే దేవుని మీద ప్రేమ ఉందని చూపిస్తాం. అపొస్తలుడైన యోహాను తన తోటి క్రైస్తవులకు ఇలా రాశాడు: “దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి తన సహోదరుణ్ణి కూడా ప్రేమించాలి.”—1 యోహా. 4:21. w23.11 8 ¶1, 3

ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం—2025
సుస్వాగతం.
ఇది యెహోవాసాక్షులు వేర్వేరు భాషల్లో రూపొందించిన ప్రచురణల పరిశోధనా పరికరం.
ప్రచురణలను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి, దయచేసి jw.orgచూడండి.
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి